![]() |
![]() |

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న కబడ్డీ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘సీటీమార్'. ఈ సినిమాలో తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా నటిస్తున్నారు. సోమవారం ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా 'సీటీమార్' సెట్‌లో తమన్నా పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. యూనిట్ సభ్యుల నడుమ కేక్ కట్ చేసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు తమన్నా. ఈ వేడుకలో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది, నటి భూమిక, చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, సమర్పకులు పవన్‌కుమార్, హీరోయిన్ దిగంగన సూర్యవంశీతో పాటు చిత్ర బృందం పాల్గొని తమన్నాకు శుభాకాంక్షలు తెలిపారు.
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలచేసిన గోపీచంద్, తమన్నాల లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు బర్త్‌డే సందర్భంగా తమన్నా స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలను పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా పోషిస్తున్నారు.
![]() |
![]() |