![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన దర్శకుల్లో స్టార్ డైరెక్టర్ బి. గోపాల్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో లారీడ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు.. ఇలా ఇప్పటివరకు ఐదు సినిమాలు రాగా, వాటిలో తొలి నాలుగు చిత్రాలు అఖండ విజయం సాధించాయి. బాలయ్య, బి. గోపాల్ కాంబినేషన్ ని బాక్సాఫీస్ కి ఫేవరేట్ చేసాయి. కాగా, ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీడ్రైవర్ విడుదలై నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు.
ఈ సందర్బంగా ఆ సినిమా జ్ఞాపకాల్లోకి వెళితే.. బ్లాక్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య, విజయశాంతి జంటగా బి. గోపాల్ రూపొందించిన ఈ చిత్రానికి ఎ. ఆంజనేయ పుష్పానంద్ కథ, కథనం సమకూర్చగా.. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. ఊర్వశి శారద, రావుగోపాలరావు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని రావుగోపాలరావు సమర్పణలో యస్. జయరామారావు నిర్మించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 1990 డిసెంబర్ 21న విడుదలైన లారీడ్రైవర్.. అప్పట్లో ప్రతి థియేటర్ లోనూ రికార్డు స్థాయి వసూళ్ళను ఆర్జించింది.
![]() |
![]() |