![]() |
![]() |

రన్ రాజా రన్ (2014)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు సుజీత్. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ చూశాడు. ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సాహో (2019) చేశాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం.. సౌత్ లో ఆశించిన స్థాయి విజయాన్ని సాధించకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం హిట్ లిస్ట్ లో చేరిపోయింది.
సాహో తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసీఫర్ రీమేక్ చేయాల్సిన సుజీత్.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ రీమేక్ ని రీమేక్ స్పెషలిస్ట్ మోహన రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సుజీత్ నెక్స్ట్ వెంచర్ పై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. సుజీత్ ఓ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని.. ఇందులో టాలెంటెడ్ స్టార్ విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. రన్ రాజా రన్, సాహో తరహాలో ఈ సినిమా కూడా స్టైలిష్ ఫిల్మ్ గా తెరకెక్కబోతోందని సమాచారం. మరి.. ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |