![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని సరసన కనువిందు చేసిన నాయికల్లో సాయిపల్లవి ఒకరు. ఈ ఇద్దరు జంటగా నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) మూడేళ్ళ క్రితం ఇదే తేదిన (డిసెంబర్ 21) విడుదలై ఘనవిజయం సాధించింది. కట్ చేస్తే.. ఇప్పుడిదే తేదికి వీరిద్దరి కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది.
ఆ వివరాల్లోకి వెళితే.. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవి జంటగా శ్యామ్ సింగ రాయ్ పేరుతో ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ మధ్యే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సోమవారం (డిసెంబర్ 21) నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళింది. మొత్తమ్మీద.. నాని, సాయిపల్లవి లక్కీ డేట్ కే వారిద్దరి కాంబినేషన్ లో సెకండ్ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళడం ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. మరి.. ఏంసీఏ లాగే శ్యామ్ సింగ రాయ్ కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, శ్యామ్ సింగ రాయ్ లో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టెయిన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ క్రేజీ వెంచర్.. 2021 ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
![]() |
![]() |