శేఖర్ మాష్టర్ ఏ స్టెప్ వేసినా టాప్ స్టార్స్ తో వేయించినా అది సూపర్ డూపర్ హిట్ ఐపోతుంది. అంత టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూమెంట్స్ కి మంచి క్రేజ్ కూడా ఉంది. అతనివి చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు. ఢీ షోకి జడ్జ్ గా ఆయన పని చేసాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టారు.
అది కూడా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా మాష్టర్ తో కలిసి. ఇద్దరి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ప్రభుదేవా మాష్టర్ కలిసి చేస్తున్న ఒక వర్కింగ్ స్టైల్ ని పోస్ట్ చేసాడు శేఖర్ మాష్టర్. "మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 9 సంవత్సరాల క్రితం నేను మీ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ మూవీ జాక్సన్ అనే హిందీ చిత్రానికి కొరియోగ్రఫీ చేసాను ...ఇక ఇప్పుడు మీ రాబోయే మరో చిత్రానికి కొరియోగ్రఫీ చేయడం చూస్తుంటే మరో సారి నా కల నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చింది మాష్టర్. నా చిన్నప్పటి నుంచి మీరే నాకు ఇన్స్పిరేషన్. మున్ముందు మీరు భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను" అంటూ పోస్ట్ చేసాడు ... కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్ శేఖర్ మాష్టర్ గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా ఉంటూ సాధారణ స్థాయి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వచ్చాడు. కొందరికైతే ఆయన ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. తమ సినిమాల్లో శేఖర్ మాష్టర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి మరి అవకాశాలు ఇస్తుంటారు స్టార్స్. బుల్లితెరపైనా డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తూనే స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. అలా అటు సిల్వర్ స్క్రీన్, ఇటు స్మాల్ స్క్రీన్ మీద ఆయన తన టాలెంట్ ని చూపిస్తూ వస్తున్నారు.