ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(chandrahaas)తన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీతో హీరోగా తన సత్తా చాటాడు.ఇప్పుడు'బరాబర్ ప్రేమిస్తా'(barabar premistha)అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా 'సంపత్ రుద్ర' దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్,ఎవిఆర్ మూవీ వండర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజయ్యింది.
డైనమిక్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో రిలీజయిన టీజర్ విడుదలైన కాసేపట్లోనే సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. టీజర్ ని చూస్తుంటే లవ్,యాక్షన్,ఎమోషనల్ కి చెందిన అన్ని ఎలిమెంట్స్ ని నింపుకున్న సినిమాగాఅర్ధమవుతుంది.తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంతో కథా కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. హీరో చంద్రహాస్ రోల్ పవర్ పుల్ గా ఉండటంతో పాటుగా హీరోయిన్ మేఘనా ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేసింది. చంద్రహాస్,ప్రతినాయకుడుగా చేస్తున్న అర్జున్ మహీ మధ్య టగ్ ఆఫ్ వార్ కూడా ఆకట్టుకుంది.'నువ్వు నన్ను కొడతాంటే నొప్పి నీ కళ్లలో తెలుస్తుందేంట్రా..'అనే డైలాగ్ అయితే హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.బీజీఎం,సినిమాటోగ్రఫీ,ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా టాప్ క్వాలిటీతో ఉన్నాయి.
ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కి బాగా రీచ్ అయ్యింది.నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా "బరాబర్ ప్రేమిస్తా'.ఈ సినిమా టీజర్ లాంఛ్ చేసినందుకు వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా.ఈ మూవీలో నేను హీరోగా నటించడానికి మా డీవోపీ శేఖర్ కారణం ఆయన నా బ్లాక్ డాగ్ వైట్ చిక్ సినిమా టీజర్ చూసి ఈ టీమ్ కు పరిచయం చేశారు. శేఖర్ బ్రదర్ కు థ్యాంక్స్.సంపత్ గారు ఎంతో క్లారీటీతో,మంచి క్వాలిటీతో రూపొందించారు.నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చందు,వెంకి, చిన్ని గార్లకి థ్యాంక్స్.మేఘన అద్భుతంగా నటించింది. అర్జున్ బ్రదర్ తో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది.ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. మూవీకి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
యాక్టర్ అర్జున్ మహి కూడా మాట్లాడుతూ 2018లో 'ఇష్టంగా, సినిమాతో మీ ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు ఆ మూవీ రూపొందించారు.ఇదే ప్రొడక్షన్ లో వచ్చింది. ఇష్టంగా సినిమా చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇదే టీమ్ "బరాబర్ ప్రేమిస్తా " సినిమాను చేస్తోంది. చిన్న చిత్రంగా మొదలైన ఈ సినిమా రోజు రోజుకూ స్పాన్ పెంచుకుంటూ వచ్చింది. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ లో ఉండేవారు. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చాడు.దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ మా మూవీ టీజర్ లాంఛ్ చేసిన మా ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను గతంలో ఇష్టంగా, ఏక్ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు పేరు వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని 'బరాబర్ ప్రేమిస్తా'ని ప్రారంభించాం.చంద్రహాస్ హీరోగా ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆటిట్యూడ్ స్టార్ గా ఆయన గుర్తింపు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా మా సినిమా ఉంటుంది. కాస్ట్ అండ్ క్రూ మాకు బాగా సపోర్ట్ చేశారు.మూవీ గురించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్ లో చెబుతానని చెప్పుకొచ్చాడు.మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా అయిన హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ బరాబర్ ప్రేమిస్తా " సినిమాతో హీరోయిన్ గా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్, ప్రొడ్యూసర్స్ చందు, చిన్ని, ఎవిఆర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు థియేటర్స్ లోకి వస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ - "బరాబర్ ప్రేమిస్తా " సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను పరుచూరి మురళి, జయంత్ సి పరాన్జే గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేశాను. సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.డైలాగ్స్ రమేష్ రాయ్,డీవోపీ వైఆర్ శేఖర్, మ్యూజిక్ ఆర్ఆర్ ద్రువన్, ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి,కథ ఎంఏ తిరుపతి,స్క్రీన్ ప్లే సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి పీఆర్ఓ, సాయి సతీష్, ప్రొడ్యూసర్స్ గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్