Home  »  News  »  విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ

Updated : Dec 20, 2024

సినిమా పేరు: విడుదల పార్ట్ 2 
తారాగణం:విజయ్ సేతుపతి,సూరి,మంజువారియర్, గౌతమ్ వాసుదేవమీనన్,అనురాగ్ కశ్యప్, కిషోర్,ఇళవరసు,రాజీవ్ మీనన్ తదితరులు
సంగీతం:ఇళయరాజా 
సినిమాటోగ్రఫీ:ఆర్.వేళ్ రాజ్ 
రచన,దర్శకత్వం: వెట్రిమారన్ 
నిర్మాతలు:కుమార్,రామారావు 
బ్యానర్స్:ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్ 
విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2024 

2023 లో సూరి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదల పార్ట్ 1 ఘన విజయాన్ని  అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు దానికి కొనసాగింపుగా విడుదల పార్ట్ 2 ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.పైగా మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి హీరో కావడంతో అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్(విజయ్ సేతుపతి) పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ గా వర్క్ చేస్తుంటాడు.ఆ తర్వాత కొంత కాలానికి ఒక ఫ్యాక్టరీ లో కార్మికుడుగా ఉద్యోగం చేస్తు,తనలాగే అభ్యుదయ భావాలు కలిగిన ఫ్యాక్టరీ ఓనర్ కూతురు మహాలక్ష్మి( (మంజు వారియర్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.ఇద్దరు కలిసి అణగారిన వర్గాల తరుపున పోరాడుతూ ఉంటారు.ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు పెరుమాళ్ ని చంపాలని రహస్యంగా బంధించి చిత్ర హింసలకి గురి చేస్తుంటారు.కానీ బయట ప్రపంచానికి పెరుమాళ్ తమ వద్ద లేడని చెప్తారు.ఆ తర్వాత పెరుమాళ్ పోలీసుల నుంచి పారిపోతాడు.టీచర్ గా పని చేస్తున్న పెరుమాళ్ తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం ఏంటి? ఒక ఫ్యాక్టరీ లో కూలీగా ఎందుకు పని చేసాడు? పోలీసులు,ప్రభుత్వం కలిసి పెరుమాళ్ ని ఎందుకు చంపాలనుకుంటుంది?పెరుమాళ్,మహాలక్ష్మి లు కలిసి చేసిన పోరాటం ఏంటి? తప్పించుకున్న పెరుమాళ్ మళ్ళీ పోలీసులకి దొరికాడా? దొరికితే ఏం చేసారు? అసలు  పెరుమాళ్ పోరాటం యొక్క లక్ష్యం ఏంటి?  ఈ సమాజానికి ఏమైనా సందేశం ఇచ్చాడా? ఈ కథలో పోలీస్ వాన్ డ్రైవర్ కుమరేశన్(సూరి) పాత్ర ఏంటనదే ఈ కథ

ఎనాలసిస్

విడుదల పార్ట్ 1 లో  పోలీస్ ట్రైనింగ్ కి వచ్చిన సూరి,పెరుమాళ్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో మొదటి భాగం ముగుస్తుంది. పార్ట్ 2 లో  పోలీసుల కస్టడీలో ఉన్న పెరుమాళ్ ని పోలీసులు చిత్ర హింసలకి గురి చెయ్యడంతో ప్రారంభమయ్యి,పెరుమాళ్ జీవితంలో గతంలో జరిగిన విషయాలన్నింటిని పార్ట్ 2 లో దర్శకుడు వెట్రి మారన్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి కథలు తమిళనాడులో తక్కువ గా వచ్చి ఉండవచ్చు.కానీ తెలుగులో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి.ఎర్రజెండా ఎలా పుట్టుకొస్తుందో,ఒక విప్లవకారుడు ఎలా పుట్టుకొస్తాడో, 
కొంత మంది జమిందారీ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు,పేద వాళ్ళని ఎంత దారుణంగా హింసిస్తూ,ఎదురుతిరిగితే ఎలా హతమారుస్తున్నారో,దానికి పరిష్కారం ప్రజల్లోనే ఉందనేది అంతర్లీనంగా చెప్పడం జరిగింది.ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్  అభ్యుదయ బావాలు కలగడానికి గల కారణాలు,ఎర్రజెండా కి సంబంధించిన పార్టీ పెద్దల పరిచయం,పెరుమాళ్ ఒక ఉద్యమ నాయకుడుగా ఎదగడానికి తోడ్పడిన మనుషులు, ఆ తర్వాత ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తని వదిలేసినా ఒక జమిందారీ వంశానికి చెందిన మహాలక్షి పరిచయం,ప్రేమ,పెళ్లి ని చూపించారు.ఇంకో పక్క కస్టడీ లో ఉన్న పెరుమాల్ ని చూపిస్తూనే ఈ కథ మొత్తాన్ని పెరుమాళ్ వాయిస్ ఓవర్ లో ఫ్లాష్ బ్యాక్ గా చెప్తు ప్రేక్షకులకి ఎక్కడా  బోర్  కొట్టకుండా చేసారు. కాకపోతే మహాలక్షి,పెరుమాళ్ పాత్రల మధ్య కథ ని కొంచం లెన్త్ గా చూపించి,ఆ క్యారెక్టర్స్ మధ్య ఎంటర్ టైన్మెంట్ ని చుపించాల్సింది. ఎందుకంటే మహా లక్ష్మి జమిందారీ వంశానికి చెందిన అమ్మాయైనా కూడా ఫ్యాక్టరీ లో కార్మికురాలిగా,ఖాకి డ్రెస్ వేసుకొనే పని చేస్తుంది.కాబట్టి ఆ కోణంలో ఎంటర్ టైన్ మెంట్ ని ఫిక్స్ చేసుండాలసింది. అదే విధంగా పెరుమాళ్ ని బంధించిన పోలీసు ఉన్నతాధికారులు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా వాళ్లే మాట్లాడుకుంటు ఉంటారు.కథ ప్రకారం ముఖ్యమంత్రి క్యారక్టర్ ని కూడా చూపించి ఆయనకి కథ కి ఉన్న లింక్ కి కూడా ఇన్ వాల్వ్ చేసుండాల్సింది. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే కథ  స్టార్టింగ్ నుంచే సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి సెకండ్ ఆఫ్ కూడా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది.పెరుమాళ్ అహింస నుంచి  హింసకి పూనుకోవడం, ఆ తర్వాత హింసని కుడా వదిలెయ్యడం లాంటివి చూపించి చివరకి ఒక నిర్ణయం తీసుకోవడంపైనే దృష్టి
 కేంద్రీకరించడాన్ని చూపించారు.కాకపోతే అడవిలో పెరు మాల్ పోలీసులతో ట్రావెల్ అవుతు వాళ్ళతో చెప్పే మాటలు గాని సన్నివేశాలు గాని చాలా కొత్తగా ఉన్నాయి.

నటీనటులు,సాంకేతిక నిపుణల పనితీరు:
విజయ్ సేతుపతి(vijay sethupathi)యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది.పెరుమాళ్ క్యారక్టర్ కి సంబంధించిన పలు షేడ్స్ లో  తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు.మూవీ చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి విజయ్ సేతుపతి కనపడకుండా కేవలం పెరుమాళ్ మాత్రమే కనపడతాడు.అంతలా ఆయన తన క్యారక్టర్ లో ఒదిగిపోయాడు.మంజు వారియర్ కూడా మహాలక్ష్మి క్యారక్టర్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో తనని తప్ప మరొకర్ని ఊహించలేం.సూరితో పాటు మిగతా క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళ ముందు మెదులుతున్న నిజమైన పాత్రల్లా నటించారు.ఇక వెట్రి మారన్(vetri maaran)దర్శకత్వ ప్రతిభ మరోసారి అర్ధమయ్యింది.ఆర్టిసుల నుంచి పర్ఫెక్ట్ నటనకి రాబట్టుకోవడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.కరుప్పన్ క్యారక్టర్ లో చేసిన ఆర్టిస్ట్ కూడా తన పెర్ ఫార్మెన్స్ తో   థియేటర్స్ లో విజిల్స్ వేయించాడు. డైలాగ్స్ కూడా కథ కి చాలా హెల్ప్ అవ్వడంతో పాటుగా    ప్రతి ఒక్కర్ని కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.ఇళయరాజా నేపధ్య సంగీతం కూడా మూవీకి ప్లస్ అయ్యింది.పావురం అనే సాంగ్ అయితే హైలట్. కెమెరా పని తనం కూడా సూపర్బ్ గా ఉంది.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే..

విడుదల పార్ట్ 2 లాంటి సామాజిక నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో చాలానే వచ్చాయి.పైగా తెలిసిన సన్నివేశాలు కావడం కూడా మూవీకి మైనస్ గా పరిగణించవచ్చు.మూవీ అయితే మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. 

 

రేటింగ్ 2 .5 / 5 

                                                                                                                                                                                                                                                                                                       అరుణాచలం






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.