పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 న హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ సంఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కూడా ఈ రోజు హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్ ని కలిసి బాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని మీడియా సముఖంగా చెప్పడం జరిగింది.
ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్(sukumar)కూడా హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించడం జరిగింది. తన భార్య తబిత(tabitha)ద్వారా శ్రీ తేజ్ తండ్రికి ఘటన జరిగిన నాలుగు రోజులకే అంటే డిసెంబర్ 9 న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్నిఅందచేయగా ఇప్పుడు వైద్య,విద్య,ఆర్థిక సహకారం అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.