పాష్ లొకాలిటీలోని ఓ బిల్డింగ్ ముందు వచ్చి ఆగిందొక కారు. అందులోంచి దిగిందొక యువతి. నేటి ఫ్యాషన్ అయిన చీలికలు పేలికలుగా ఉన్న జీన్స్ ధరించి ఉంది. కార్ డోర్ క్లోజ్ చేసి, ఇంట్లోకి వెళ్లింది. ట్రౌరైజర్ బటన్స్ తీస్తూ నడిచింది. ట్రౌజర్ తీసేసి, అండర్వేర్ మీద ఉంది. షెల్ఫ్ ఓపెన్ చేసింది. ఏదో మేగజైన్ లాంటిది బయటకు తీసింది. కెమెరా కింద నుంచి జూమ్ చేస్తే.. ఆమె తొడలు, ఛాతీ భాగం క్లోజప్‌లో కనిపిస్తున్నాయి. వెనక్కి తిరిగింది. కెమెరాకు వీపు తిప్పింది. ముందుకు నడిచింది. చేతిలో బుక్ లేదు. టేబుల్ దగ్గరకు వచ్చి గ్లాసులో వాటర్ పోసుకుంది. తలుపు ధడ్ ధడ్ అని చప్పుడు చేసింది. భయంతో ఉలిక్కిపడిన ఆమె చేతిలోని గ్లాసును వదిలేసింది. భళ్లున పగిలింది గ్లాసు. నీళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరో "సుష్మా" అని పిలిచారు. ఆమె అడుగులు ముందుకు వేసింది. కెమెరా కళ్లు వెనుక నుంచి క్లోజప్‌లో ఆమె తొడలను చూపిస్తున్నాయి. దాక్కుని, తలుపు కొడుతోంది ఎవరా అని నక్కి నక్కి చూసిందామె. "ఈజ్ ఇట్ ఓ ఘోస్ట్?" అని తెరపై అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి.
ఆమె జీన్స్ వేసుకొని మద్యం తాగుతూ చిన్నగా డాన్స్ చేస్తోంది. ఎదురుగా చైర్లో కూర్చొని ఓవైపు మందు తాగుతూ, ఇంకోవైపు కళ్లతో ఆమెను తాగేస్తున్నట్లు చూస్తున్నాడో యువకుడు. ఆమె అతనికి దగ్గరగా వచ్చిందో, అతడే ఆమె దగ్గరకు వెళ్లాడో.. మొత్తానికి ఇద్దరూ దగ్గరగా వచ్చారు. అతను కూర్చొనే ఉన్నాడు, ఆమె నిల్చొనే ఉంది. చేతితో ఆమె తొడ దగ్గర పట్టుకొని, తొడను ముద్దు పెట్టుకున్నాడతను. గుర్ర్‌ర్ర్‌ర్ర్.. మంటూ రీరికార్డింగ్ సౌండ్.. అందులో భాగంగానే "రామా.. కృష్ణా.." అంటూ మగగొంతు వాయిస్.. అతను తల ఎత్తి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తన్మయత్వంతో కళ్లు మూసుకుంది. సరిగ్గా అప్పుడే మరోసారి తలుపులు ధడ్ ధడ్ అని చప్పుడు చేశాయి. "ఈజ్ ఇట్ ఎ కిల్లర్?" అనే అక్షరాలు తెరపై ప్రత్యక్షమయ్యాయి.
అతను.. ఆమె.. కౌగిలించుకున్నారు. మెట్ల అవతల గోడ మీద ఎవరిదో మగమనిషి షాడో.. అది చూసి భయంతో "శ్యామ్ శ్యామ్" అని కేకేసింది ఆమె. అతను ఉలిక్కిపడి ఆమెను వదిలి అటు వేపు చూశాడు. ఆ షాడో మనిషి కోసం ఇద్దరూ వెతుకుతున్నారు. అతని చేతిలో ఏదో చిన్న విగ్రహం.. ఆమె చేతిలో రివాల్వర్. ఈసారి "నో.. ఇటీజ్.. థ్రిల్లర్" అంటూ స్క్రీన్‌పై అక్షరాలు పడ్డాయి. ఆమె కళ్లల్లో నీళ్లు.. ఆమె దాక్కుంటూ దాక్కుంటూ వెళ్లింది. ఎవరికో ఫోన్ చేసింది. ఫ్లోర్ మీద కూర్చొని నక్కుతూ నక్కుతూ వెళ్తుంటే.. ఇదే ఛాన్స్ అన్నట్లు కెమెరా చొంగ కార్చుకుంటూ ఆమె కాళ్లను.. అదే తొడలను.. క్లోజప్‌లో ఫోకస్ చేస్తూ కదిలింది. ఈసారి కెమెరా పూర్తిగా సభ్యతను మర్చిపోయి ఆమెను అత్యంత అసభ్యంగా చూపించసాగింది. సోఫా దగ్గర ఆమె మోకాళ్లపై కూర్చొని రహస్యంగా అవతలికి చూసింది.. లేచింది. ఆమె వెనకకు ఎవరో వచ్చి నిల్చున్నారు. ఒక్కసారి భయంతో కేకవేసి, చేతిని ఊపింది. ఆమె చేతిలోని వస్తువు అతని తలను బలంగా తాకింది. "గెట్ రెడీ" అనే అక్షరాలు వచ్చాయి. అంతే.. సినిమా అయిపోయింది.. సారీ.. ట్రైలర్ అయిపోయింది. మిగతాది చూడాలంటే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లోనో, శ్రేయాస్ ఈటీలోనో చూసుకోండి.
స్త్రీని భోగ వస్తువుగా తప్ప ఇంకో రకంగా ఆర్జీవీ చూసే అవకాశం లేదని మరోసారి స్పష్టాతిస్పష్టంగా స్పష్టం చేసింది 'థ్రిల్లర్' ట్రైలర్. రెండున్నర నిమిషాల ఈ ట్రైలరే ఇలా ఉంటే మిగతా 20 నిమిషాల ఫిల్మ్ (అంతకంటే ఈ ఫిల్మ్ నిడివి ఎక్కువ ఉంటుందా?) ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
ట్రైలర్లో సుష్మగా కనిపించి, కెమెరాకు అన్ని విధాలా సహకరించి, తన శరీరాంగాల్ని అధిక శాతం ప్రదర్శించిన నటి పేరు అప్సరా రాణి అయితే, ఆమెతో కలిసి మందు తాగి, ఆమెను ముద్దులు పెట్టుకొని, చివరలో ఆమె చేత దెబ్బతిన్న శ్యామ్ అనే ఆ నటుడి పేరు రాక్ కచ్చి. ఇద్దరూ ఒడియా యాక్టర్లు. డీఎస్సార్ బీజీఎం సమకూర్చిన ఈ ఫిల్మ్‌కు సినిమాటోగ్రాఫర్ పేరు వేయలేదు. బహుశా కెమెరాను నీచమైన కోణాల్లో తిప్పి, అప్సరా రాణి శరీరంలోని కోణాల్ని అత్యంత అభ్యంతరకరంగా, అసభ్యకరంగా చూపించినందున సిగ్గుపడి.. తన పేరు వేయవద్దని ఆర్జీవీని అర్థించినట్లుంది. 'నగ్నం' తర్వాత ఆర్జీవీ నుంచి వస్తోన్న మరో పచ్చి బూతు ఫిల్మ్ 'థ్రిల్లర్'. ఫ్యాన్స్ అందరూ ఇప్పట్నుంచే చొంగ కార్చుకుంటూ 'థ్రిల్లర్' కోసం ఎదురు చూస్తూ ఉండటం గ్యారంటీ.