అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కొవిడ్-19తో పోరాడుతూ ప్రస్తుతం ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అదే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఐశ్వర్యా రాయ్, ఆమె కూతురు ఆరాధ్య కొవిడ్-19 నెగటివ్‌గా తేలి, ఇంటికి వచ్చేశారు. తండ్రీ కొడుకులకు మాత్రం ఇంకా ఆ వైరస్ అంటిపెట్టుకొనే ఉంది. అయితే తమ ఆరోగ్య స్థితి గురించి ఎప్పటికప్పుడు వాళ్లు సోషల్ మీడియాలో తెలియజేస్తూ వస్తున్నారు.
లేటెస్ట్గా అభిషేక్ బచ్చన్ హాస్పిటల్ లోపల నైట్ వాక్ చేసినట్లు ఓ పిక్చర్ షేర్ చేశాడు. ఆ పిక్చర్లో ఆయన లేడు. ఖాళీగా ఉన్న హాస్పిటల్ కారిడార్‌ను తన సెల్‌ఫోన్‌తో బంధించి, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆయన, “Light at the end of the tunnel! #latenightwalks” అనే క్యాప్షన్‌ను దానికి జోడించాడు. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆయన సోదరి శ్వేతా నందా “Soon” అంటూ కామెంట్ పెట్టింది.