లాక్‌డౌన్‌లో పదిహేను రోజుల పాటు 'బృందావనమది అందరిదీ' చిత్రీకరణ జరిగింది. కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సన్నివేశాలు తెరకెక్కించామని ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీధర్ సీపాన స్పష్టం చేశారు.
"సెట్‌లో టెక్నికల్ టీమ్ అంతా మాస్కులు, ఫేస్ షీల్డులు తప్పనిసరిగా ధరించేవారు. యాక్టర్లు, మిగతా యూనిట్ భౌతిక దూరం పాటించాం. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు పరిసరాలు అన్నీ శానిటైజ్ చేసేవాళ్ళం. సెట్‌కి వచ్చే ముందు, సెట్ నుండి వెళ్లే ముందు ప్రతి ఒక్కరి టెంపరేచర్ చెక్ చేసేవాళ్ళం. అన్నిటి కంటే ముఖ్యంగా గంట గంటకి కషాయం, టీ సర్వ్ చేశాం. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సజావుగా షూటింగ్ జరిగింది" అని శ్రీధర్ సీపాన అన్నారు.
శ్రీనివాస్ వంగాల నిర్మిస్తున్న 'బృందావనమది అందరిదీ'లో రిచా పనయ్, హర్షవర్థన్ రాణే, పోసాని కృష్ణమురళి, '30 ఇయర్స్' పృథ్వీ తదితరులు ప్రధాన తారాగణం. ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.
లాక్‌డౌన్‌లో తెలుగు సినిమా షూటింగులు చాలా తక్కువ జరిగాయి. దర్శకుడు రవిబాబు 'క్రష్' షూటింగ్ చేశారు. అలాగే, చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'సూపర్ మచ్చి'లో కీలక సన్నివేశాలు, పాటలు తెరకెక్కించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తెరెక్కిస్తున్న సినిమా షూటింగ్ కూడా జరిగింది. రామ్ గోపాల్ వర్మ సంగతి చెప్పనవసరం లేదు. ఓటీటీలో వారానికి ఒక సినిమాతో వస్తున్నారు.