తెలుగు సహా హిందీ ప్రేక్షకుల్లోనూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుర్తింపు ఉంది. 'సత్య', 'కంపెనీ', 'రంగీలా' సినిమాలు మొదలుకొని అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'సర్కార్' సిరీస్ వరకు హిందీలో వర్మ అద్భుతమైన సినిమాలు తీశారు. క్రమ క్రమంగా తర్వాత ఆయన గ్రాఫ్ కిందకు పడింది. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన క్రేజ్ ను 'మర్డర్' సినిమాకు ఉపయోగించుకోవాలని వర్మ డిసైడ్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ప్రేమకథ, ప్రణయ్ హత్య, ఆ తర్వాత మారుతీ రావు ఆత్మహత్య ఆధారంగా వర్మ నిర్మిస్తున్న సినిమా 'మర్డర్'. దీనిని హిందీలోనూ విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. మంగళవారం తెలుగు ట్రైలర్ విడుదల చేసిన వర్మ, బుధవారం హిందీ ట్రైలర్ విడుదల చేశారు. అయితే, రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ట్రైలర్ లో డైలాగులు లేకపోవడం వలన తెలుగులో సంబంధించిన ప్రశ్నలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. ఉత్తరాది లోను పరువు హత్యలు ఉన్నాయి. అందువల్ల అక్కడ ప్రేక్షకులకు సినిమా ఆసక్తి కలిగించవచ్చు.