ఒకప్పుడు బాలీవుడ్ పరిశ్రమ అన్ని ఫిలిం ఇండస్ట్రీలపై మార్కెట్ పరంగా తన ఆదిపత్యాన్ని చలాయించేది. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే వారికి చులకన భావం ఉండేది. ఎందుకంటే హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. అంతేతప్ప తెలుగులో హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేసింది చాలా తక్కువ. అయితే అది 80వ దశకం నుంచి కాస్త మారింది. అయితే హిందీ సినిమాలకు మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అన్నట్టు ఒక్కసారిగా టాలీవుడ్ తన పంజా విప్పింది. బాలీవుడ్ మీద పంచ్‌ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరఆరనఆరన, బాహుబలి వంటి సినిమాల రుచి చూసిన బాలీవుడనకి ఇప్పుడు కొత్త పుష్ప2 పెద్ద రaలకన ఇచ్చింది. డిసెంబరన 5న విడుదలై పది రోజులు పూర్తి చేసుకున్న పుష్ప2. కొత్త రికార్డులు సఋష్టిస్తూ కలెక్షన్ల పరంగా రాకెటన వేగంతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప2 గురించే చర్చ.
ఇప్పటికే పుష్ప2 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అంతేకాదు 10వ రోజు100 కోట్లు కలెక్ట్ చెయ్యడం అనేది సినీ చరిత్రలోనే లేదు. అలాంటి అరుదైన రికార్డును పుష్ప2 సొంతం చేసుకుంది. దీన్ని ధృవీకరిస్తూ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు హిందీలో 500 కోట్ల కలెక్షన్ సాధించి బాహుబలి2 తర్వాత 500 కోట్ల క్లబ్లో చేరిన రెండో సినిమాగా మరో రికార్డును నమోదు చేసింది. పుష్ప2 దూకుడు చూస్తుంటే ఆదివారం కూడా 100 కోట్లకుపైనే వసూలు చేసేలా ఉంది. అదే జరిగితే ఇప్పటివరకు బాహుబలి2పై బాలీవుడ్లో ఉన్న రికార్డును పుష్పరాజ్ క్రాస్ చేసేస్తాడు. ఇక ఓవర్సీస్లో కేవలం 10 రోజుల్లోనే 12 మిలియన్ డాలర్లు వసూలు చేసి అక్కడ కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది పుష్ప2. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న జోష్ చూస్తుంటే మరో పది రోజులవరకు కలెక్షన్ల మోత మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.