మెగా ఫ్యామిలీలో ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్‌ని లంచ్‌కి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. పుష్ప రిలీజ్ టైమ్‌లో జరిగిన ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి బన్నీతో చిరంజీవి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు అతన్ని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి మాత్రం శుక్రవారం బన్నీ కుటుంబ సభ్యుల్ని కలిశారు. కానీ, శనివారం మాత్రం ఆయన బన్నీ దగ్గరకి రాలేదు. అయితే ఆదివారం అల్లు అర్జునే తన మావయ్య ఇంటికి వెళ్తున్నాడు. మెగాస్టార్ ఇంటికి బన్నీ వెళుతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ మీటింగ్ తర్వాత ఇరువర్గాల మధ్య ఉన్న వివాదాలు సమసిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.
ఒక కారులో బన్నీ, స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ వెళ్లారు. మరో కారులో అల్లు అరవింద్ వెళ్లారు. అయితే చిరంజీవి నివాసంలో ఆ ఫ్యామిలీకి చెందిన అందరూ ఉంటారా లేక చిరంజీవి ఒక్కరే ఉంటారా అనేది అందరికీ ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. చిరంజీవి కుటుంబ సభ్యులందర్నీ కలిసే పక్షంలో అక్కడ నాగబాబు, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్‌తో కలిసి పవన్‌కళ్యాణ్.. మెగాస్టార్ ఇంటికి వెళ్తాడనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పటికే అతను విజయవాడ వెళ్లిపోయారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. అయితే మెగాస్టార్ నివాసంలో ఎవరెవరు ఉన్నారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.