పట్టరాని ఆనందమైనా, గొంతు దిగన బాధ అయినా.. వంద మాటల్లో చెప్పలేనిది ఒక్క క్లిక్‌తో చెప్పవచ్చు. ఫొటో గొప్పతనమే అది. మనిషి జీవితంలోని అసలైన మలుపు.. పెళ్లి. ఆ అనుభూతిని దృశ్యరూపంలో మార్చుకోనిది ఎవరు? ఎందరో సెలబ్రిటీల పెళ్లిళ్లను మధురానుభూతులుగా మార్చిన అలాంటి ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్. ఏ వస్తువునైనా తన మేజిక్‌తో అందంగా చూపించగల సామర్థ్యంం అతడి సొంతం. అతను హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. లక్నో అమ్మాయి దేవికను పెళ్లి చేసుకొని ముంబైలో స్థిరపడ్డాడు.
జోసెఫ్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయితే, దేవిక వెడ్డింగ్ ప్లానర్. జంటగా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఘనంగా జరిపించేస్తున్నారు. పెళ్లి పీటలెక్కిన ప్రేమపక్షులు నాగచైతన్య-సమంత, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్ అతనే. చైతూ-సమంత వేసిన ఏడడుగుల మధురానుభూతులను చిరకాలం నిలిచిపోయేలా తన కెమెరాతో ఆ క్షణాలను బంధించాడు. పెళ్లి పీటలపై చైతూ, సమంత జంట నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఫొటోలు ఆన్లైన్లో తెగ హల్చల్ చేశాయి.
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రామ్‌చరణ్, ఉపాసన కామినేని పెళ్లిలోనూ జోసెఫ్ కెమెరా కనికట్టు చేసింది. బాలీవుడ్, హాలీవుడ్ కలయిక అయిన ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడి ఫొటోల హడావిడంతా జోసెఫ్‌దే. ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ అవార్డులనెన్నింటినో తన ఫొటోలతో అతను గెలుచుకున్నాడు.