తెలుగుతెర అరుంధతి అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి. బాహుబలి మనసు సహా దేశ, విదేశాలలో ప్రేక్షకుల మనసు దోచిన దేవసేన కూడా అనుష్కే. మంగుళూరు ముద్దుగుమ్మ నటన గురించి, అందం గురించి ఏమని వర్ణించాలి చెప్పండి. మరి, ఆమెకు జన్మనిచ్చిన మాతృమూర్తిని ఎప్పుడైనా చూశారా? అప్పట్లో అనుష్క తల్లి ఎలా ఉండేవారో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం... ఫొటో చుడండి.
తన తల్లి ప్రఫుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో అనుష్క శుభాకాంక్షలు తెలిపారు. "నువ్వు కేవలం అమ్మ మాత్రమే కాదు, నాకు తెలిసిన గొప్ప మహిళ నువ్వే. అమ్మా... ప్రేమతో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అనుష్క పేర్కొన్నారు. ప్రఫుల్లా శెట్టి ఓల్డ్ ఫొటోను పోస్ట్ చేశారు. సాధారణంగా ఫ్యామిలీ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను అనుష్క వీలైనంత గోప్యంగా ఉంచుతారు. ఇటీవల అప్పుడప్పుడూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.