![]() |
![]() |

మాల్దీవుల్లో ఇటీవల ఒకరి తర్వాత ఒకరుగా సినీ సెలబ్రిటీలు విహార యాత్ర చేసి, అక్కడ బికినీ డ్రస్సుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలగజేశారు. అంతమంది మాల్దీవులను పావనం చేయగా, తాను మాత్రం ఎందుకు చేయకూడదనుకున్నదో, ఏమో హన్సిక సైతం అక్కడకు చెక్కేసింది. అమ్మ మోనా, బ్రదర్ ప్రశాంత్‌తో కలిసి వెళ్లిన హన్సిక.. ఆ దీవుల్లో సెలవుల్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.
మాల్దీవులకు వెళ్లీ వెళ్లగానే సీప్లేన్ ముందు నిల్చొని కెమెరాకు కొన్ని సెన్సేషనల్ పోజులిచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, "The best way to see Maldives from the top on board is by @transmaldivian seaplane !" అంటూ క్యాప్షన్ జోడించింది.
.jpg)
.jpg)
ఆ తర్వాత తన బాడీ వంపుసొంపుల్ని ప్రదర్శించే పింక్ కలర్ డ్రస్‌లో దిగిన పిక్చర్స్‌ను షేర్ చేసింది. "Mermaids are real, don’t let scientists fool u" అంటూ క్యాప్షన్ పెట్టింది.
.jpg)
.jpg)
ఆ ఫొటోల్లో హన్సికను చూసినవాళ్లంతా మాల్దీవులను తన గ్లామర్‌తో హీటెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |