వాహ్ తాజ్ అంటూ తన వాయిస్ తో తాజ్ మహల్ టీ పొడికి విశేషమైన ఖ్యాతిని తెచ్చిన ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్.హిందుస్థానీ సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని తెచ్చిన ఘనత కూడా ఆయన సొంతం.
కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యల తో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ నిన్న అమెరికా లో ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన స్వస్థలం ముంబై కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోనే ఉంటున్నారు.డెబ్భై మూడు సంవత్సరాల వయసు కలిగిన జాకీర్ హుస్సేన్ స్వస్థలం ముంబై కాగా భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.పద్మశ్రీ, పద్మభూషణ్,పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలని కూడా ఆయన అందుకోవడం జరిగింది.ఆయన మృతి భారతీయ సంగీత రంగానికి, ముఖ్యంగా తబలా వాయిద్యానికి తీరని లోటని పలు సంగీత,సినీ, రాజకియ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.