![]() |
![]() |
బంగళాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు.. ఇదీ సన్నివేశంలోని ప్రధాన అంశం. నందమూరి బాలకష్ణ పవర్ఫుల్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కత్తి పట్టి డైలాగులు చెప్తే అభిమానులు వెర్రెత్తి పోతారు. అయితే అలాంటి ఫెరోషియస్ క్యారెక్టర్లోనే కాదు, ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో, సెంటిమెంట్‌ను పండించడంలోనూ ఆయనకు ఒక శైలి ఉంది. ఫ్యామిలీని సరిదిద్దే బాధ్యతగల కొడుకుగా, చెల్లెలి కాపురాన్ని నిలబెట్టే అన్నయ్యగా కనిపించే ఈ సినిమా పేరు ‘టాప్ హీరో’.
నందమూరి బాలకష్ణ, ఎస్.వి.కష్ణారెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ఇది. సౌందర్య హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రోహిణి హట్టంగడి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాన్ని ఒక దారికి తెచ్చేందుకు, అక్కడ ఉన్న దుష్ట శక్తులకు బుద్ధి చెప్పేందుకు హీరో కంకణం కట్టుకుంటాడు. అందులో భాగంగానే చెల్లెలి కాపురాన్ని నిలబెడతాడు. అయితే అతను ఆ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఆఖరికి చెల్లెలు కూడా అతన్ని అసహ్యించుకుంటుంది. ఆమె భర్త తిరుగుబోతు. ఆమె కళ్ళ ముందే మరో స్త్రీతో సరసాలాడుతూ ఉంటాడు.
ఇది చూసి ఆమె కుమిలిపోతుంది. వాళ్ల కాపురాన్ని సరిదిద్దుతానని చెల్లెలితో చెప్తాడు. కానీ, ఒక బజారు రౌడీ సహాయం తనకు అక్కర్లేదు అని ఇంట్లోకి వెళ్లి ఏడుస్తుంటుంది. ఇదే అదనుగా వారి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న దాసు ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతన్నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. అప్ప్పుడు బాలకష్ణ ‘బంగళాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు’ అంటాడు.
ఆమెపై అఘాయిత్యం చెయ్యాలని ప్రయత్నించిన దాసుకి బుద్ధి చెప్పాలంటే.. నర్తనశాల సినిమాలో భీముడు ఏం చేశాడో అదే చేస్తే సరి అని చెల్లెలికి చెప్తాడు. ఒక పథకం ద్వారా దాసుకి ఇద్దరూ కలిసి బుద్ధి చెబుతారు. దాసుని అలా చెయ్యమని చెప్పింది హీరో మామ. దాసుని తీసుకొని అక్కడికి వెళ్లి తనదైన శైలిలో ‘మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నర్తనశాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా” అంటూ వార్నింగ్ ఇస్తాడు. సినిమాలో ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఈ సన్నివేశంలో వినోదం మాత్రమే కాదు, ఆత్మాభిమానం, మహిళా గౌరవం పట్ల ఉన్న నిబద్ధత వంటి విషయాలు కనిపిస్తాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటి సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి చూపిస్తుంటారు. అన్యాయం ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా దాన్ని ఎదిరించే ధైర్యం, వారికి బుద్ధి చెప్పే తెలివి ఉండాలని ఈ సీన్ ద్వారా అర్థమవుతుంది. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే మా Teluguone Cinema ఛానల్‌ను Subscribe చేసుకోండి.
![]() |
![]() |