![]() |
![]() |

-నిన్న రిలీజైన పెద్ది సెకండ్ సింగల్
-మెగా అభిమానుల కోలాహాలం
-కానీ ఆ విషయంలో నో కాంప్రమైజ్ అయ్యారా!
మేకర్స్ ముందుగానే చెప్పిన మాటకి అటు ఇటుగా 'పెద్ది'(Peddi)నుంచి నిన్న నైట్ 'రయ్ రయ్ రా రా'(Rai Rai Raa Raa)సాంగ్ రిలీజ్ అయ్యింది. అసలు అధికారకంగా సాంగ్ రిలీజ్ కాకుండానే ఏడుగంటల ప్రాంతంలో 'రయ్ రయ్ రా రా సాంగ్' ఇదేనంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి వీడియో సాంగ్స్ వచ్చాయి. వాళ్లంతా అభిమానులో, లేక సంగీత వీరాభిమానులో తెలియదు కానీ బాగానే కష్టపడ్డారు. దీన్నిబట్టి పెద్ది క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. అధికారకంగా వచ్చిన రయ్ రయ్ రారా సాంగ్ క్రేజ్ కా బాప్ లాగా ఉంది. ఆ రేంజ్ లో ఉంటుందని మెగా అభిమానులు కూడా ఉహించి ఉండరు. దీంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు సాంగ్ లోని ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. జేబులో రూపాయి లేకపోయినా, ఈ సాంగ్ వింటూ ప్రపంచంలో ఎక్కడైనా మహారాజులా బతికెయ్యవచ్చు. అంతటి శక్తిని సాంగ్ ని పదాలు ఇస్తున్నాయనే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.
సాంగ్ ని ట్యూన్ చేసిన ఏఆర్ రెహ్మాన్(AR Rehman)నే ఆలపించడం జరిగింది. దీంతో సాంగ్ రేంజ్ పెరగడంతో పాటు తన గాత్రంతో మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా అనంత్ శ్రీరామ్(Ananth Sriram)సాహిత్యం నుంచి వచ్చిన లిరిక్ లోని 'పాతికేళ్లకే పాతబడిపోకు.. మాట అనుకోకు, గెలుపోంటోయ్ వెలుగు.. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే.. ఆరు నూరైనా మందల్లో నుంచి వేరై రా.. నిన్నే నీ లోపల పాతేసుకోకు వంటి పదాలు లింగ బేధంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఉన్నాయి.
Also read: Dhurandhar vs toxic: ఈ రెండు చిత్రాలపై ఆశలు వదులుకోండి.. ఏరియాస్ ఇవే
ఇక ఈ సాంగ్ భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దివ్య శక్తిని కూడా ప్రసాదించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో సరికొత్త రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. జానీ మాస్టర్(Jani Master)కొరియోగ్రఫీ ఆ రేంజ్ లో ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి. బుచ్చిబాబు(Buchhi Babu)దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా పెద్ది సరసన జాన్వీ కపూర్ జత కడుతుంది. రయ్ రయ్ రా రా దెబ్బకి ఇన్నాళ్లు రికార్డ్స్ ని తమ అమ్ముల పొదిలో ఉంచుకొని విర్ర వీగిన 'చికిరి చికిరి' సాంగ్ తన అమాయకత్వానికి నవ్వుకునే పరిస్థితి.
![]() |
![]() |