![]() |
![]() |

-అప్పుడే అయిపోందనుకోకండి
-ఇప్పుడే మొదలైంది
-రేణుదేశాయ్ అంటే ఏమనుకుంటున్నారు
-కేసు నమోదు చేసిన పోలీసులు
రేణుదేశాయ్(Renu Desai)..వరుసగా సినిమాలు చేస్తుండకపోయినా సినీ సెలబ్రటీ హోదా మాత్రం తనని వదిలి వెళ్లడం లేదు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ అనే ట్యాగ్ లైన్ తో పాటు బద్రి, జానీ మూవీల హీరోయిన్ అవ్వడమే అందుకు కారణం. మంచి క్యారెక్టర్స్ వస్తే సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఇటీవల చెప్పిన రేణు దేశాయ్ రీసెంట్ గా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దీంతో సోషల్ మీడియా మిగతా వైరల్ న్యూస్ ని పక్కన పెట్టి రేణుదేశాయ్ ని లూప్ లైన్ లోకి తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఇటీవల రేణు దేశాయ్ వీధి కుక్కల విషయంలో మాట్లాడుతు 'కొన్ని స్ట్రీట్ డాగ్స్ దాడి చేస్తే మిగతా వాటిపై దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ వ్యాఖ్యలని వక్రీకరిస్తూ కొంత మంది హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పర్సనల్ లైఫ్, పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చెయ్యడంతో పాటు జుగుప్స కలిగించే విధంగా ట్రోల్ చేస్తున్నారు. సదరు ట్రోల్ల్స్ తారా స్థాయికి చేరుకోవడంతో రేణు దేశాయ్ తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ట్రోల్స్ స్క్రీన్ షాట్లని పోలీసులకి అందచేయడంతో పాటు అసభ్యకర పోస్టులు చేసిన వారి వివరాలతో పాటు కామెంట్స్ స్క్రీన్ షాట్లని పోలీసులకి అందజేశారు.
also read: మెగా ఫ్యాన్స్ కి షాక్... నోట్ రిలీజ్
తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ ఇందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు నా వ్యక్తిత్వాన్నే కాకుండా, శరీర భాగాల గురించి, పిల్లల గురించి అత్యంత దారుణమైన భాషలో కామెంట్స్ చేసారు. కాశీ లాంటి పవిత్ర స్థలంలో ఉన్నప్పుడు కూడా అసహ్యమైన మాటలతో దాడి చేసే స్థాయికి కొందరు దిగజారారని చెప్తు కన్నీటి పర్యంతమైంది.
![]() |
![]() |