![]() |
![]() |

-థియేటర్స్ లో కేరళ స్టోరీ 2 హంగామ
-పాజిటివ్ టాక్ నిజమేనా!
-కలెక్షన్స్ పరిస్థితి ఇదే
రిలీజ్ ఏప్పుడుంటుందో తెలియని పరిస్థితుల్లో ఈ నెల 27 న సెకండ్ షోస్ నుంచి స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది ది కేరళ స్టోరీ పార్ట్ 2(The Kerala Story 2). మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి అయితే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం సాధించిన కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి వివరాలు చూద్దాం.
శుక్రవారం సెకండ్ షో నుంచి కలుపుకొని ఇప్పటి వరకు టోటల్ గా 12 .3 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఒక్క ఆదివారమే 5 కోట్ల నెట్ ని రాబట్టింది. అదే రోజు బాలీవుడ్ మూవీస్ లేటెస్ట్ మూవీస్ అస్సి 1.6 కోట్లు, దో దీవానే సెహర్ మెయిన్ 1.45 కోట్లు, తు యా మెయిన్ 80 లక్షలు సాధించినట్టుగా చెప్తున్నారు. దీంతో సండే రోజుకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో కేరళ స్టోరీ పార్ట్ 2 పై చేయి సాధించినట్లయింది.
ఇక ఈ కలెక్షన్స్ ని చూస్తుంటే కేరళ స్టోరీ మొదటి భాగం కలెక్షన్స్ గుర్తుకు వస్తున్నాయి. ఆ చిత్రం కూడా కలెక్షన్స్ నిదానంగా స్టార్ట్ అయ్యి టోటల్ రన్ లో 302 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. మరి ఇప్పుడు సీక్వెల్ కూడా ఆ శాయి కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి. కామాఖ్య నారాయణ సింగ్(Kamakhya Narayana Singh)దర్శకత్వంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా, సుమిత్, అర్జన్ సింగ్, యుక్తం ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించారు.
also read: Ustaad bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి షాకింగ్ బిజినెస్.. ఇక ట్రైలర్ ఎప్పుడో చెప్పండి
![]() |
![]() |