ఒకవైపు ఘట్టమనేని ఫ్యామిలీకి కాంపౌండ్ హీరో. మహేష్ బాబుకు బామ్మర్ది. మంచి ఫిజిక్ ఉంది. హీరోకి కావలసిన లక్షణాలని ఉన్నాయి. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది హీరో సుధీర్ బాబు పరిస్థితి. సుధీర్ బాబుకు కథల ఎంపిక సరిగా చేతకావడం లేదు. ఆయన తాజాగా హంట్ చిత్రంలో నటించారు. ఇది అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన ఓ మలయాళ చిత్రానికి ఫ్రీ మేక్. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇలా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో రాబోతోంది.
ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. మొత్తం మీద సినిమా విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం. స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించి సుధీర్ బాబు అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన అలాంటి రోల్ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొత్తానికి మలయాళం నుండి కాపీ కొట్టిన ముంబై పోలీస్ సినిమా ఆధారంగా రూపొందిన హంట్ చిత్రం అందరికీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.
సినిమా పర్వాలేదని టాక్ వచ్చినప్పటికీ రీమేక్ అనే ముద్రపడటంతో సినిమాను ఓటిటిలో రిలీజ్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. సినిమాలో సరైన కంటెంట్, కొత్తదనం లేని పాత చిత్రాలకు, రీమేక్ లకు కాలం చెల్లిందని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే హంట్ చిత్రం వంటి ఫలితాలే రిపీట్ అవుతాయని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. స్టార్ హీరోల పరిస్థితి వేరు. వారు రీమేక్ లు చేసినా, ఫ్రీమేక్ లు చేసినా ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. కాస్త ఆయా అభిమానులకు కావాల్సిన అంశాలను వండి వారిస్తే ఎలాగోలా నెట్టుకొస్తాయి. కానీ చిన్న హీరోల పరిస్థితికి ఇది భిన్నం. కంటెంట్ను బలంగా ఉండేలా, నేటి జనరేషన్ కి తగ్గట్లుగా చూసుకోవాల్సి వుంటుంది. ఈవిషయాలలో తేడా వస్తే మరో హంట్ అవుతాయి.