మాస్కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్ టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. తనదైన యాటిట్యూడ్ తో యువతను మెప్పిస్తున్నారు. ఆయన యాటిట్యూడ్ సరికాదని చెప్పాలి. కానీ నేటి యువత ఇలాంటి వారికే ఎక్కువ అభిమానులుగా మారుతున్నారు. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ వంటి వారినే ఎక్కువగా అభిమానిస్తూ, వారి యాటిట్యూడ్ ను ఫాలో అవుతున్నారు. సీనియర్ హీరో అర్జున్ వివాదంతో ఆ మధ్య విశ్వక్సేన్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన దాస్ కా ధమ్కీ అనే చిత్రం చేస్తున్నారు.
ఆయనే నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కానుంది. తన కెరీర్‌లో మొదటిసారిగా ఆయన తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా విశ్వక్సేనే కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నివేదా పేతురాజు హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా లిరికల్ వీడియోస్ కూడా విడుదల అయ్యాయి. అందులోని ఓ పాట లో నివేదా పేతురాజ్ ఎంతో అందంగా కనిపించింది. సినిమాపై అంచనాలు పెరిగాయి.
తాజాగా విశ్వక్సేన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకి రౌడీ ఫెలో, నితిన్ తో చల్ మోహనరంగా మూవీలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్టర్. కృష్ణచైతన్య కథను వినిపించడం, దానికి విశ్వక్సేన్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఒక వైపు కృష్ణచైతన్య ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభిద్దామా? అని తొందరగా ఉన్నారు. విశ్వక్సేన్ ఓకే చెప్పారు. నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ సిద్దంగా ఉన్నారు. దాంతో చిత్రం ప్రారంభమే తరువాయి అని తెలుస్తోంది.
వాస్తవానికి కృష్ణచైతన్య దర్శకునిగా శర్వానంద్ హీరోగా ఓ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ మూవీకి రామ్ చరణ్ పూజా కార్యక్రమాలు జరిపారు. కానీ ఈ శర్వా పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది. మరి విశ్వక్సేన్ తో కృష్ణ చైతన్య చేయబోయే సబ్జెక్ట్ కొత్త స్టోరీనా? లేక శర్వానంద్ కు వినిపించిన కథనే కాస్త మార్పులు చేర్పులు చేసి విశ్వక్సేన్ కి వినిపించాడా? అనేది తెలియాల్సి ఉంది.