ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప1 ది రైజ్ చిత్రం సుకుమార్ చేతుల్లో రూపుదిద్దుకుని పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కేవలం ఇండియాలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా విడుదలై అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ రూపొందించింది. పుష్ప మేనరిజం డైలాగ్స్, దేవిశ్రీ సాంగ్స్ సినిమాని పాపులర్ అయ్యేలా చేశాయి. శ్రీవల్లి.. ఊ అంటావా ఊఊ అంటావా పాటల్లో స్టెప్స్ సినిమాని మరింత పాపులర్ అయ్యేలా చేశాయి. ఉత్తరాదిలో పార్ట్ 1 తో సంచలనం సృష్టించింది. అందరూ పుష్పా2 కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 లో ఓ కూలీ సిండికేట్ స్మగ్లర్‌గా ఎదిగిన క్రమాన్ని చూపించారు. ఆ సిండికేట్ వ్యక్తి వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండల్ వుడ్ స్మగ్లర్‌గా తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడనే నేపథ్యంలో పార్ట్2 సాగుతుందని సమాచారం.
విదేశాల్లోనూ ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. జపాన్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో షూటింగ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ను మించిన అత్యధిక బడ్జెట్‌తో ఊహించని లొకేషన్స్ తో భారీ స్థాయిలో పార్ట్ 2 ని రూపొందించనున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతోంది. పుష్పరాజ్ ఇంట్రడక్షనల్ సాంగ్ ని భారీ స్థాయిలో తీస్తున్నారు. ఈ సాంగ్ ధియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ పూనకాలు తెప్పించే రేంజిలో మ్యూజిక్ అందించాడని చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించాడని సమాచారం. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ కలం నుంచి ఈ పాట రావడం విశేషంగా చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందించిన నాటు నాటు పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్ అందిస్తున్న సాహిత్యం పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో ఈ పాటని చిత్రీకరిస్తున్నారట. ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా సినిమా సగం పూర్తయిన తర్వాత మాత్రమే అప్ డేట్స్ విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. వీరితో పాటు పార్ట్ 2లో పవర్ ఫుల్ విలన్ గా జగపతిబాబు ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు.