ప్రముఖ నటి నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లయి ఆరు నెలలవుతున్నా, వారిద్దరి పెళ్లి వీడియో ఇంకా విడుదల కాలేదు. అప్పుడు రిలీజ్ చేస్తారేమో, ఇప్పుడు రిలీజ్ చేస్తారేమోనని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న వారికి నిరాశ ఎదురవుతోంది.పోడాపోడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు విఘ్నేష్. విజయ్‌సేతుపతి, నయనతారతో నానుమ్ రౌడీదాన్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి నయన్ - విఘ్నేష్ మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తర్వాత, ప్రేమ - పెళ్లిదాకా చేరుకుంది.2023 జూన్‌లో మహాబలిపురంలోని ఓ రెసార్ట్ లో వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.ఎరుపు రంగు ఫ్యూజన్ శారీలో నయనతార పెళ్లికూతురుగా ముస్తాబయ్యారు. విఘ్నేష్ పట్టుపంచె, చొక్కా ధరించి పెళ్లికొడుకుగా కూర్చున్నారు.
ఘనంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వీడియో అతి త్వరలోనే విడుదలవుతుందని అప్పట్లో ప్రకటించారు. 30 మంది వీవీఐపీలు, 100 మంది సన్నిహితులు పాల్గొన్న వీరి పెళ్లి వేడుకను చూడాలని నయన్ ఫ్యాన్స్ వెయిటింగ్.
పెళ్లి వీడియో హక్కులను ఈ జంట ఓటీటీకి విక్రయించింది. దాంతో, అసలు పెళ్లికి సంబంధించిన చిన్న క్లిప్స్ కూడా బయటకు రాలేదు. ఫొటోలను మాత్రమే విక్కీ రిలీజ్ చేశారు. నవంబర్‌లో నయన్ - విక్కీ వీడియో త్వరలోనే రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది ఆ ఓటీటీ సంస్థ. ఆ ప్రకటన విడుదలై కూడా రెండు నెలలయినా, ఇంకా ఎందుకు రావట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమ పెళ్లి వీడియో డాక్యుమెంటరీకి ఫైనల్ టచస్ ఇవ్వడంలో విఘ్నేష్ శివన్ ఇన్వాల్వ్ అయ్యారట. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ షూట్ చేస్తున్నారట. వాటన్నిటినీ తమ పెళ్లి వీడియోకి జత చేయడానికి నిర్ణయించుకున్నారట. అందుకే ఈ ఆలస్యం జరుగుతోందట. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజులు పడుతుందట. మార్చిలో ఈ వీడియో రిలీజ్ అవుతుందనేది కోడంబాక్కం న్యూస్. ఏప్రిల్‌లో రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది విక్కీ- నయన్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.