బాహుబలి రూపొంది ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో తమిళ దర్శకుడైన సుందర్ సి 2017లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఫిలిం ఫెస్టివల్లో సంఘమిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. జయం రవి, ఆర్య, శృతిహాసన్, దిశాపటాని ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. కానీ పలు కారణాలవల్ల ఈ చిత్రం వాయిదా పడింది. మరలా ఇన్నేళ్లకు ఈ సినిమా అప్డేట్ బయటకు వచ్చింది. డైరెక్టర్ సుందర్ సి తన డ్రీమ్ ప్రాజెక్టును రూపొందించేందుకు మళ్లీ సిద్ధమవుతున్నాడు. 450 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అక్టోబర్‌లో పట్టాలెక్కించబోతున్నారు. అయితే గతంలో ఈ సినిమాలో హీరోగా జయం రవిని అనుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రలో విశాల్ ని తీసుకున్నారని సమాచారం. మరో పాత్రకు ఆర్యను తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సుందర్ సి అరణ్మనై 4 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే సంఘమిత్ర సెట్స్ లోకి వెళుతుంది. దీనిని రెండు భాగాలుగా రూపొందించనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన ద్వితీయార్థంలో రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాలు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు గతంలో ప్రకటించింది. కానీ అది ఇప్పుడు అది 450 కోట్లకు చేరింది. ఈ సినిమాలో చేస్తానని చెప్పిన శృతిహాసన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తరువాత హన్సిక, అంజలి, ఓవిలియా వంటి పేర్లు వినిపించినప్పటికీ ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్క పోతోంది. మరి ఇందులో చివరగా ఎవరెవరు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. హీరోలు హీరోయిన్లుగా పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ వాటిలో ఎంతవరకు నిజముంది? ఎవరు చివరకు నిలుస్తారు?ఎవరు సినిమాకు పనిచేస్తారు? అనేవి తెలియాల్సి ఉంది.