English | Telugu

లైఫ్ చేంజింగ్ విషయాలు జరుగుతున్నాయి అన్న పూజ

తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సారీ చెప్పారు నటి పూజ హెగ్డే. తన సోదరుడి వివాహ వేడుకకు సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు రాధేశ్యామ్  బ్యూటీ. `` నా సోదరుడికి పెళ్లయింది. తను ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిగింది. ఈ వారం అంతా నాకు రోలర్ కోస్టర్ లాగా మారింది. నా కళ్ళ వెంట‌ ఆనందభాష్పాలు వచ్చాయి. మా అన్న తన జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు. మా వదినకి కుటుంబంలోకి ఆహ్వానం`` అంటూ పోస్ట్ పెట్టారు పూజ హెగ్డే. అంత‌టితో ఆగకుండా తన ఫ్యాన్స్ కి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సారీ చెప్పారు. తను సోషల్ మీడియాకు దగ్గరగా లేకపోవడానికి కారణం తన జీవితంలో మేజర్ చేంజ్ జ‌ర‌గ‌డ‌మేన‌ని  అన్నారు.

త‌న కొత్త వ‌దిన‌కు వెల్కమ్ టు ది ఫ్యామిలీ అని చెప్తూ... తన ఫ్యామిలీ పిచ్చిదేన‌ని, కానీ ప్రేమతో నిండిందని సరదాగా వ్యాఖ్యానించారు. పూజ హెగ్డే నటించిన సర్కస్ గ‌తేడాది ఆఖరిలో విడుదలైంది. రోహిత్ శెట్టి స‌ర్క‌స్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌, వరుణ్ శర్మ,  జాక్వలిన్ ఫెర్నాండెజ్ కీల‌క‌ పాత్రల్లో న‌టించారు.కిసి కా భాయ్ కిసీ కీ జాన్‌లోనూ న‌టిస్తున్నారు పూజా హెగ్డే. ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. వెంకటేష్, జగపతిబాబు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు నటించే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు పూజ హెగ్డే. త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ చేస్తున్న ఈ  సినిమాలో సంయుక్తా మీనన్ కూడా ఓ హీరోయిన్‌గా  కనిపిస్తారు.