![]() |
![]() |

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ బాలీవుడ్‌లలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ఫ1 చిత్రంతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.నేడు ఆయన స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారారు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ సాధించారు. ఇక పుష్ప1- ది రైజ్ సినిమాలో మంగళం శీనుగా నటించిన సునీల్, దాక్షాయిని పాత్రలో నటించిన అనసూయ భరద్వాజులు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
సినిమా చివర్‌లో వచ్చిన ఫహద్ ఫాజిల్ రెండో భాగానికి మెయిన్ విలన్ గా ఉన్నట్లు పుష్ప1- ది రైజ్ లో ఎండింగ్ ఇచ్చారు. దాంతో పుష్ప2-ది రూల్ చిత్రంలో ఆయనదే కీలక విలన్ పాత్ర అని తేలిపోయింది. ఇక ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఏర్పడిన కారణంగా ఇప్పుడు సినిమాలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. మొదటి భాగంలో ఒక సాధారణమైన ఎర్రచందనం చెట్టుకొట్టే కూలి ఎర్రచందనం సిండికేట్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనే అంశాన్ని చూపించారు.
అలా ఎదిగిన తరువాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే విషయాన్ని పుష్ప2లో చూపిస్తారని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్ హిట్ అయింది. హిందీలో అయితే పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభం వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం పుష్పా2 కోసం మరో పవర్ఫుల్ విలన్నీ రంగంలోకి దించుతున్నారని అంటున్నారు ఆయన ఎవరో కాదు మొన్నటిదాకా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకొని లెజెండ్ సినిమాతో ఒక పవర్ఫుల్ విలన్‌గా మారిన జగపతిబాబు ఈ సినిమాలో క్రేజీ విలన్ గా నటించనున్నారు.
తండ్రి పాత్రలు మామ పాత్రలు చేస్తున్నా సరే విలన్ గా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తమిళ, మలయాళ సినీ పరిశ్రమల నుండి కూడా ఆయనకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఆయా చిత్రాలలో ఆయన నటిస్తూనే ఉన్నారు. ఈ దశలో ఆయనను పవర్ఫుల్ విలన్ గా వాడుకోవాలని సుక్కు భావించాడట. ఇది సరైన నిర్ణయమే అని చెప్పాలి. ఈ రెండో భాగం కోసం జగపతిబాబు కోసం పవర్ఫుల్ పాత్రను సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |