![]() |
![]() |

దరువు శివ డైరెక్షన్లో సూర్య ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను సూర్య 42 గా పిలుస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం వైభవంగా హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఆ మధ్య జరిగింది. యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చెన్నై సమీపంలోని ఎన్నూర్ హార్బర్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఆల్రెడీ ఈవీపీ ఫిలిం సిటీలో అద్భుతమైన సెట్లో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇటీవల ఈ షెడ్యూల్ ని పూర్తి చేసింది యూనిట్.
నెక్స్ట్ ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందా అని ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మెగా బడ్జెట్లో భారీ సెట్స్ ను రూపొందిస్తోంది చిత్ర యూనిట్. 3d లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాగా సూర్య 42 గురించి కోడంబాక్కంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
పది భాషల్లో రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమాలోని పిరియాడిక్ దృశ్యాలను వచ్చే నెల నుంచి చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సర్వ సన్నాహాలు చేసుకుంటోంది. మార్చి నెలాఖరుకు గాని, ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.
బాలీవుడ్ నటి దిశా పటానీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య నటించిన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా సూర్య 42కి స్పెషల్ ప్లేస్ క్రియేట్ అయింది. దాదాపు 5 రకాల గెటప్పుల్లో సూర్య ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. సూర్య 42 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |