![]() |
![]() |

ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన నటి అంజలి. తెలుగు నటి అయిన ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఆ తరువాత ఈమె తెలుగు మేకర్స్ దృష్టిలో పడింది. 2006లో ఫోటో అనే చిత్రం ద్వారా పరిచయమైన ఈమె ఆ తరువాత వరుసగా తమిళ చిత్రాలు చేసింది. కానీ ఈమెకు మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వచ్చింది. ఇందులో ఆమె పోషించిన సీతా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ రామ్ లు కలిసిన నటించిన మసాలా చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఈమె గీతాంజలి చిత్రంలో నటించింది. సరైనోడు చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. తెలుగులో చిత్రాంగదా, నిశ్శబ్దం, వకీల్ సాబ్ ,మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలలో కనిపించింది. ఎంతో టాలెంట్ అందుకు తగిన అందచందాలు ఉన్నప్పటికీ ఎందుకనో ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. అవకాశాలు వస్తున్న సరైన పాత్ర లను ఆమెకు ఇవ్వడానికి టాలీవుడ్ దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇలాంటి సమయంలో ఈమె సిల్వర్ స్క్రీన్ కు ఆల్టర్నేటివ్‌గా మారిన ఓటీటీలపై దృష్టి పెట్టింది. ఓటిటిలలో హవా సాగిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరంటే ఇప్పుడు అందరూ అంజలి పేరు చెప్తారు. ఈ మధ్య ఆమె డిస్నీ హాట్ స్టార్ లో రెండు వెబ్ సిరీస్ లో నటించింది. వీటి ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. దాంతో మరల సినిమా అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ఆర్సీ15 చిత్రంలో ఈమె పెద్ద చరణ్ పాత్రకు జోడిగా నటిస్తోంది.
ఈమె తెలుగు అమ్మాయి అయినా తమిళంలో మొదట క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఆమెకు మలయాళం సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఇప్పటికే మలయాళంలో ఆమె రెండు సినిమాలు చేసింది. ఐదేళ్ల తర్వాత మరో సినిమా ఆమెను వరించింది. 2010లో ఫైన్స్ 2018లో పెరంబు చిత్రాలు నటించిన ఈమెకు మరో ఐదేళ్ల గ్యాప్ తర్వాత మాలీవుడ్డులో అవకాశం వచ్చింది. ఇలా తెలుగు తమిళ భాషలో అలరిస్తున్న అంజలి ఇప్పుడు మలయాళం లో కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. మొత్తానికి అంజలి ఏ మాత్రం నిరాశ పడకుండా అటు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ ద్వారా తనదైన సత్తాను చాటుతూ మరిన్ని సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
![]() |
![]() |