![]() |
![]() |

తెలుగులో జగపతిబాబు, శ్రీకాంత్ ఇద్దరు ఫ్యామిలీ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. జగపతిబాబు కొన్ని మాస్ చిత్రాలలో కూడా నటించాడు. అలాగే శ్రీకాంత్ కూడా అలాంటి ప్రయోగాలు కొన్ని చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యమా స్పీడ్ గా దూసుకొని పోతున్నారు. కానీ శ్రీకాంత్ పరిస్థితి మాత్రం అటు ఇటు కాకుండా ఉంది. జగపతిబాబును చూసి ఏదో చేయాలనుకున్న శ్రీకాంత్ తప్పులో కాలేశాడని అర్థమవుతుంది. రెంటికీ చెడ్డ రేవడిగా మారుతున్నారు. ముందు చూస్తే నుయ్యి... వెనుక చూస్తే గొయ్యిలా ఆయన పరిస్థితి మారిపోయింది. జగపతిబాబుకు కలిసి వచ్చినట్టుగా సెకండ్ ఇన్నింగ్స్ శ్రీకాంత్ కు కలిసి రావడం లేదు. శ్రీకాంత్ యుద్ధం శరణం అనే సినిమాలో పూర్తిస్థాయి విలన్ గా మారాడు. ఆ తరువాత విలన్ అనే మలయాళ సినిమా, ది విలన్ అనే కన్నడ సినిమాల్లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత అఖండ సినిమాలో ఆయనకు పవర్ఫుల్ పాత్ర వచ్చింది.. సినిమా కూడా హిట్ అయింది. అయినా ఇప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ మాత్రం లభించలేదు. అఖండ సినిమాలో శ్రీకాంత్ విలనిజం పండిస్తాడు అనుకుంటే మరో విలన్ కింద పని చేస్తూ ఆ క్రెడిట్ అంతా అతనికే ఇచ్చేశారు.
ఆ తరువాత శ్రీకాంత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం అవుతాడు అనుకుంటే హీరో అన్నయ్య పాత్రలో కూడా చేస్తూ వస్తున్నారు. ఒకరకంగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే క్లిక్ అయ్యారు. ఆయనను చూసి శ్రీకాంత్ అలాగే నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటే అంతగా కలిసి రావడంలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన హంట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈయన శంకర్- రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న ఆర్సీ15 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే వారసుడు చిత్రంలో కూడా నటించారు. మరి హంట్ చిత్రం ద్వారా అయినా శ్రీకాంత్ హిట్ ని అందుకుంటాడో లేదో చూడాలి.
![]() |
![]() |