![]() |
![]() |

అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డినోమోరియో నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మమ్ముట్టి తో కలిసి పని చేశారు. నార్త్ మీడియాతో మాట్లాడిన డినోమోరియో మమ్ముట్టి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మమ్ముట్టి సార్ తోనూ, అఖిల్ తోను పనిచేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని అన్నారు డినో. మమ్ముట్టి ఇప్పటికే ఎన్నో అవార్డుల అందుకున్న నటుడని, ఫెంటాస్టిక్ యాక్టర్ అని, ఆయన్ని చూసి ఈ తరం వాళ్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు డినో. మమ్ముట్టితో కలిసి తాను నటిస్తున్న రెండో సినిమా ఏజెంట్ అని ప్రస్తావించారు.
గతంలో మమ్ముట్టితో కలిసి రాజీవ్ మీనన్ దర్శకత్వంలో కండుకొండేన్ కండుకొండేన్ అనే సినిమాలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నైలో కండుకొండేన్ కండుకొండేన్ షూటింగ్లో మమ్ముట్టిని చూసినప్పటికీ, ఇప్పటికీ తనకు తేడా ఏమీ అనిపించలేదని అన్నారు. అప్పుడు ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నానని... ఇప్పుడు కూడా అదే భావన కలిగిందని అన్నారు డినో. ప్రతి ఏడాది మమ్ముట్టి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తూనే ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడిగా ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయినా ఎప్పటికప్పుడు తన పాత్రలను వేల్యుయేట్ చేసుకుంటూనే ఉంటారు. కొత్త పాత అనే తేడా లేకుండా నటీనటులందరితో కలిసిమెలసి పనిచేయడం మమ్ముట్టికే చెల్లుతుంది. తన పనిని చాలా అంకితభావంతో చేస్తారు మమ్ముట్టి. ఆయనతో రెండు సినిమాల్లో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు డినో.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కథ గురించి చెప్పగానే నచ్చిందని, వెంటనే ప్రాజెక్టుకు సంతకం చేశానని అన్నారు. దర్శకుడు ఏమి చెబితే అదే చేశాను. అదే మాటను ముందే ఆయనతో చెప్పాను . దర్శకుడిగా నా క్యారెక్టర్ మీద ఆయనకి పరిపూర్ణ అవగాహన ఉంటుంది. అందుకే పూర్తిగా దర్శకుడి నిర్ణయానికి వదిలేసి, ఆయన చెప్పిన పనులు చెప్పినట్టు చేశాను. స్క్రీన్ మీద ఆ ఫలితం కనిపిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు డినో
![]() |
![]() |