![]() |
![]() |

సినిమా రంగంలో ఒక జనరేషన్ తర్వాత మరో జనరేషన్‌లో పాతవారిని రీప్లేస్ చేసే నటులు అరుదుగా వస్తూ ఉంటారు. సావిత్రి లాంటి నటనను ఆ తర్వాత జయసుధ చేసి మెప్పిస్తే ఆ తరువాత తర్వాత విజయశాంతి, భానుప్రియ వంటి వారు భర్తీ చేశారు. దానిని తర్వాతి తరంలో సౌందర్య అందిపుచ్చుకుంది. సౌందర్య మరణం తర్వాత ఆ స్థానాన్ని కీర్తి సురేష్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు రీప్లేస్ చేస్తున్నారు. ఇక నిన్నటి తరంలో రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హీరోలతో గ్లామర్ పాత్రలు చేయడమే కాదు... నటనలో కాస్త నెగటివ్ ఉన్న ఛాయలున్న పాత్రగా ఆమె రజినీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ చిత్రం గురించి చెప్పుకోవాలి. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో ఆమె నటించి మెప్పించింది. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో కూడా ఈమె నటన పరాకాష్టకు చేరుకుంది.
ప్రస్తుతం ఆ స్థానాన్ని కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ భర్తీ చేసేలా ముందుకు సాగుతోంది. రమ్యకృష్ణ తర్వాత అలా నెగటివ్ ఛాయలున్న పాత్రలో ఈమె అత్యద్భుతంగా నటిస్తూ రమ్యకృష్ణను మైమరిపిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్, తాజాగా బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన వీరసింహారెడ్డిల్లో ఆమె నటనే అందుకు నిదర్శనం. వీరసింహారెడ్డిలో భానుమతిగా వరలక్ష్మీ నటనను నరసింహ సినిమాలో రమ్యకృష్ణతో చాలామంది పోలుస్తున్నారు.
ప్రతీకారం కోసం ఎంతైనా తెగించే వారిగా వీరి నటనను నెటిజన్లు పోలుస్తున్నారు. ముందు ముందు సరైన పాత్రలు పడితే వరలక్ష్మి శరత్ కుమార్ రమ్యకృష్ణ మారుతుందని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తాను విలన్‌గానే పనికొస్తానని ముందే భావించినట్టు చెప్పుకు రావడం విశేషం. దీంతో ఈమెకు నటిగా మంచి భవిష్యత్తు ఉంది అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |