![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న ఈ తరం నటుల్లో సత్యదేవ్ ఒకరు. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ఆస్కారమున్న ఇతర వేషాల్లోనూ అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. తాజాగా `తిమ్మరుసు`తో ఆకట్టుకున్న సత్యదేవ్.. త్వరలో తమన్నాతో కలసి `గుర్తుందా శీతాకాలం` అంటూ పలకరించనున్నాడు. అలాగే నిత్యా మీనన్ తో జట్టుకట్టి `స్కై లాబ్`లో విహరించనున్నాడు. అదేవిధంగా `గాడ్సే`గా సందడి చేయబోతున్నాడు. అంతేకాదు.. అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ చిత్రం `రామ్ సేతు`లో ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మెగా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సత్యదేవ్. ఆ సినిమా మరేదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న `లూసిఫర్` రీమేక్. మాతృకలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తాడట. విలనిజానికి పరాకాష్టలాంటి ఈ వేషంలో సత్యదేవ్ నటించడం నిజమైతే గనుక.. తన కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ రోల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే `లూసిఫర్` రీమేక్ లో సత్యదేవ్ ఎంట్రీ, రోల్ పై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |