![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే గూజ్ బంప్స్ నిచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కి కేరాఫ్ అడ్రస్. అలాంటి ఇమేజ్ ఉన్న జక్కన్న.. మాస్ లో ఎనలేని పాలోయింగ్ ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్ తో మల్టిస్టారర్ చేస్తే? ఇక చెప్పేదేముంది.. ప్రతీ పది - పదిహేను నిమిషాలకు ఒక పోరాట ఘట్టాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. వారి ఆశలు, అంచనాలకు తగ్గట్టే.. `ఆర్ ఆర్ ఆర్` పేరుతో తెరకెక్కుతున్న సదరు మల్టిస్టారర్ లో ఏకంగా పది భారీ పోరాట ఘట్టాలకు చోటిచ్చారట జక్కన్న.
చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న చారిత్రక కల్పిత గాథగా `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతుండగా.. అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నారు. తారక్, చరణ్ రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్స్ లో ఉన్నట్టే ఇందులోనూ మాసివ్ ఫైట్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఇద్దరికీ వేర్వేరుగానూ, ఇద్దరు కలిసి శత్రుదండుపై పోరాడే ఘట్టాలుగానూ ఈ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారట రాజమౌళి. మరి.. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వెండితెరపై ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాయో తెలియాలంటే అక్టోబర్ 13 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`కి సంబంధించిన చివరి పాట చిత్రీకరణ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఇందులో తారక్, చరణ్, ఓలివియా మోరీస్, ఆలియా భట్ పాల్గొంటున్నారు. ఆగస్టు 20 నాటికి ఈ పాట తాలూకు షూటింగ్ పూర్తికానుందని సమాచారం.
![]() |
![]() |