![]() |
![]() |

నటకిరీటి రాజేంద్రప్రసాద్, నాటి అందాల తార జయప్రద జట్టుకట్టనున్నారా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ లో. అయితే సినిమా కోసం కాదు.. ఓ వెబ్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ జంటగా సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. మనసంతా నువ్వే, నేనున్నాను చిత్రాల దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ప్రస్తుతం సునీల్, సలోని జంటగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పూర్తయ్యేలోపే రాజేంద్రప్రసాద్, జయప్రద కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారట. ఏజ్ బార్ అయిన ఓ జంట ప్రేమ నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుందట. 60ల్లో ప్రేమలో పడిన ఓ జోడీ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశంతో ఈ సిరీస్ సాగుతుందట. లవ్ @ 60 పేరుతో రూపొందనున్న ఈ సిరీస్ కి సంబంధించిన చిత్రీకరణని కేవలం నెల రోజుల్లో పూర్తి చేసేలా దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.
మరి.. రాజేంద్రప్రసాద్, జయప్రదకి ఈ సిరీస్ ఎలాంటి పేరుని తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |