![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మల్టిస్టారర్స్ అరుదనే చెప్పాలి. అటుఇటుగా ఆరేళ్ళ క్రితం గోపాల గోపాల చిత్రం చేశారు పవన్. అందులో విక్టరీ వెంకటేష్ తో కలసి సందడి చేశారు. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు మరో మల్టిస్టారర్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పవన్ మల్టిస్టారర్స్ దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ (వెంకీ, రానా) కాంబినేషన్ లోనే తెరకెక్కడమే కాదు.. ఆయా చిత్రాలు రీమేక్ మూవీస్ కావడం విశేషం. గోపాల గోపాల చిత్రం బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ ఆధారంగా తెరకెక్కితే.. ఇంకా పేరు నిర్ణయించని కొత్త చిత్రం మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా రూపొందనుంది. మొత్తమ్మీద.. పవన్ మల్టిస్టారర్స్ రీమేక్ మూవీస్ కావడం.. అందులో దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించడం ఆసక్తి రేకెత్తించే అంశమే.
![]() |
![]() |