![]() |
![]() |
.jpg)
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి సినిమా షూటింగ్ అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయారు. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్‌లో 'ద కశ్మీర్ ఫైల్స్' అనే సినిమా రూపొందుతోంది. ముస్సోరిలో దాని షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో మిథున్‌కు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి పడిపోయారు. దాంతో షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనకు సపర్యలు చేశారు.
ఈ ఘటన గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, "ముస్సోరిలో మేం ఓ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం. మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ చుట్టూ ఆ సీన్ నడుస్తుంది. సడన్‌గా ఆయన పొట్టచేత్తో పట్టుకొని బాధపడ్డారు. ఆయన స్థితి బ్యాడ్‌గా అనిపించింది. ఎవరైనా ఓ సాధారణ వ్యక్తి ఆయన స్థానంలో ఉంటే కనీసం నిల్చోలేరు. కానీ ఆయన కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ సెట్స్ మీదకొచ్చి ఆ మొత్తం సన్నివేశాన్ని పూర్తి చేశారు. అలాంటి స్థితిలో ఎవరైనా షూటింగ్‌లో పాల్గొంటారనేది నేను ఊహించని విషయం. కానీ ఆయన ముందుకు వచ్చి, ఆ సీన్ చేశారు. ఆయన సూపర్‌స్టార్ కావడానికి ఇదే కారణం. చాలా కాలం నుంచి తనకు ఎలాంటి అనారోగ్యం కలగలేదని నాతో ఆయన చెప్పారు. ఆయన తరచూ నన్ను 'మీ షూటింగ్ ఆగిపోలేదు కదా?' అని అడుగుతూ వచ్చారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను.. ఎందుకంటే అంతటి అంకితభావంతో పనిచేసేవారిని కొత్త తరంలో ఎవరినీ ఇంతదాకా నేను చూడలేదు" అని చెప్పుకొచ్చాడు.
మిథున్ చక్రవర్తి లాంటి నటుడు తమ సినిమాలో ఉండటం తమకు ఎస్సెట్‌గా భావిస్తున్నానని వివేక్ తెలిపాడు. కశ్మీరీ హిందువుల దురవస్థ గురించి ప్రపంచానికి తెలియజేసే దిశలో 'ద కశ్మీర్ ఫైల్స్' ఒక చిన్న అడుగు అని అతనన్నాడు. అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ 2021లో విడుదల కానున్నది.
![]() |
![]() |