![]() |
![]() |

అర్జున్ రెడ్డి (2017)తో తెలుగునాట సంచలనం సృష్టించాడు యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మొదటి ప్రయత్నంలోనే మెగా హిట్ అందుకుని వార్తల్లో నిలిచాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అలాగే.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండని కాస్త యూత్ ఐకాన్ చేసేశాడు. కట్ చేస్తే.. ఇదే చిత్రాన్నీ స్వల్ప మార్పుచేర్పులతో కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రూపొందించి.. చాన్నాళ్ళుగా సోలో హీరోగా సాలిడ్ హిట్ లేని షాహిద్ కపూర్ కి బ్లాక్ బస్టర్ ని అందించాడు. హిందీనాట కూడా సంచలన దర్శకుడయ్యాడు. ఈ నేపథ్యంలో.. సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డి నెక్స్ట్ వెంచర్ కూడా హిందీలోనే తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే.. యానిమల్ అనే టైటిల్ ని ఈ మూవీకి ఫిక్స్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందని.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముందని బజ్. మరి.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత సందీప్ నుంచి వస్తున్న ఈ చిత్రం కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |