![]() |
![]() |

నిరాశాజనకంగా ప్రారంభమై, చివరకు వచ్చేసరికి బ్లాక్‌బస్టర్ రేంజ్‌కు చేరుకున్న బిగ్ బాస్ 4 తెలుగు షో గ్రాండ్ ఫినాలే కొన్ని ఆశ్చర్యకర ఘట్టాలకు వేదికగా నిలిచింది. వాటిలో ఒకటి.. దివి వడ్త్యకు చిరంజీవి సినిమాలో చాన్స్ దక్కడం.. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా అనౌన్స్ చేయడం. గ్రాండ్ ఫినాలేలో విన్నర్‌కు ట్రోఫీ అందించేందుకు అతిథిగా వచ్చిన చిరు మొదటగా ఎలిమినేట్ అయిన 14 మంది కంటెస్టెంట్లను పలకరించి, వారి గురించి మాట్లాడారు. హౌస్‌లో వాళ్లు చేసిన పనులను ఆయన వల్లె వేస్తుంటే.. థర్డ్ సీజన్‌లో ఎలాగైతే కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారో.. ఇప్పుడూ కంటెస్టెంట్లు ఆశ్చర్యానికి గురయ్యారు. బిగ్ బాస్ షోను తాను బాగా ఫాలో అవుతున్నారనే ఫీల్ ఇచ్చారు చిరు.
ఆ సందర్భంలో దివి వడ్త్య గురించి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. బ్యూటీ విత్ బ్రైన్‌గా ఆమెను అభివర్ణించారు చిరంజీవి. ఆమెకు నటిగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాదు.. తాను చేస్తున్న 'వేదాళమ్' రీమేక్‌లో ఆమెకు ఓ మంచి క్యారెక్టర్ ఇవ్వాలని తాను డైరెక్టర్ మెహర్ రమేశ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. అయితే, అప్పటికే క్యాస్టింగ్ అయిపోయిందని రమేశ్ చెప్పాడనీ, తాను చెప్పడంతో చివరకు సినిమాకు కీలకమైన పోలీసాఫీసర్ క్యారెక్టర్‌ను ఆమెకు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడనీ, అయితే ఆమెలోని బ్యూటీని కూడా వినియోగించుకొనేలా ఆ క్యారెక్టర్‌ను మలచాలని రమేశ్‌కు తాను సూచించినట్లు కూడా చిరు తెలిపారు.
ఆ విషయం ఆయన చెప్పగానే దివి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చాన్స్ ఇస్తున్నందుకు ఆయనకు ఆమె థాంక్స్ చెప్పింది. ఆమెకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిరు. మొత్తానికి బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఇతరత్రా కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయనేందుకు ఈ ఘట్టం ఓ నిదర్శనం.
![]() |
![]() |