![]() |
![]() |

ఇప్పట్లో పెళ్లి ఆలోచన చేయట్లేదని అల్లు హీరో శిరీష్ అంటున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకంటే శిరీష్ పెద్దవాడనీ, అతని పెళ్లయ్యాకే తన పెళ్లి ఉంటుందనీ సాయిధరమ్ తేజ్ చెప్పిన విషయం ఆన్‌లైన్‌లో హల్‌చల్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో శిరీష్ పెళ్లి ఉంటుందనీ, 2021లో అతని పెళ్లి బాజాలు మోగనున్నాయనీ ప్రచారంలోకి వచ్చింది. మీడియా దీనికి బాగా కవరేజ్ ఇచ్చింది.
దీంతో శిరీష్ స్పందించాడు. తేజ్ జోక్ చేసి ఉంటాడనీ, అందరూ దాన్ని సీరియస్‌గా తీసుకున్నారనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపాడు. తాను సింగిల్‌గా ఉండటాన్ని తన తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పిన అతను, పెళ్లి చేసుకోవాలని తాను నిర్ణయించుకుంటే, తనే ఆ విషయాన్ని స్వయంగా చెప్తానన్నాడు శిరీష్. సో.. ప్రస్తుతానికి అతను సోలో లైఫ్‌నే ప్రిఫర్ చేస్తున్నాడన్న మాట. శిరీష్ వయసు ప్రస్తుతం 33 ఏళ్లు.

![]() |
![]() |