![]() |
![]() |

ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత సంపాదనాపరులైన 100 మంది సెలబ్రిటీల్లో భారత్ నుంచి ఒకే ఒక్కడు చోటు సంపాదించుకున్నాడు. ఆ ఒక్కడు.. అక్షయ్ కుమార్! 52వ స్థానంలో నిలిచిన అక్షయ్ సంపాదన 48.5 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 356 కోట్లు. అక్షయ్ ప్రస్తుతం బచ్చన్ పాండే, బెల్ బాటమ్, సూర్యవంశీ, పృథ్వీరాజ్, అత్రంగి రే, రామ్ సేతు, రక్షా బంధన్ చిత్రాలు చేస్తున్నాడు.
బాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా అక్షయ్‌ను అభివర్ణించిన ఫోర్బ్స్ లిస్ట్ ఆయన కొవిడ్-19 రిలీఫ్ కోసం 4 మిలియన్ డాలర్లు దానం చేశాడనీ, మే నెలలో ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కాన్సర్ట్ ఐ ఫర్ ఇండియాలో పాలుపంచుకున్నాడనీ తెలిపింది. ఈ కాన్సర్ట్ ద్వారా రూ. 52 కోట్ల నిధులు సమకూరాయి.
కాగా అత్యంత సంపాదనాపరులైన సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ను అమెరికన్ రియాలిటీ స్టార్ కైలీ జెన్నర్ చేజిక్కించుకుంది. ఈ ఏడాది ఆమె సంపాదన 590 మిలియన్ డాలర్లు. అంటే, రూ. 4340 కోట్ల రూపాయలు!
ఈ నెలారంభంలో ఫోర్బ్స్ ప్రకటించిన ఏషియా-పెసిఫిక్ రీజియన్‌లో సోషల్ మీడియాపై అత్యంత ప్రభావవంత సెలబ్రిటీల లిస్ట్‌లో అక్షయ్ కనిపించాడు. ఆ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు.
![]() |
![]() |