![]() |
![]() |

పరిమిత సంఖ్యలోనే చేసినా బాపు గారి బొమ్మలు (సినిమాలు).. నిత్యసుందరమే. అలాంటి సుందరమైన చిత్రాల్లో మనవూరి పాండవులు(1978) ఒకటి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మురళీ మోహన్, ప్రసాద్ బాబు, రావుగోపాల రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని పుట్టన్న కనగల్ తెరకెక్కించిన కన్నడ చిత్రం పడువారల్లి పాండవర్(1978) ఆధారంగా తెరకెక్కించారు బాపు. మహాభారతంలోని ప్రధాన పాత్రలకు మోడ్రన్ వెర్షన్ లా ఇందులోని కొన్ని పాత్రలు ఉంటాయి.
విశేషమేమిటంటే.. మనవూరి పాండవులు తెలుగునాట విజయం సాధించడంతో ఇదే చిత్రాన్ని హిందీలో సంజీవ్ కుమార్, మిధున్ చక్రవర్తి, నజీరుద్దీన్ షా, అనిల్ కపూర్, షబానా ఆజ్మీ, రాజ్ బబ్బర్, అమ్రిష్ పురి వంటి మేటి తారాగణంతో హమ్ పాంచ్ పేరుతో తెరకెక్కించారు బాపు. 1980లో విడుదలైన ఈ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు మనవూరి పాండవులు, ఇటు హమ్ పాంచ్.. రెండు కూడా నవంబర్ నెలలోనే జనం ముందుకు వచ్చాయి. 1978 నవంబర్ 9న మనవూరి పాండవులు రిలీజ్ కాగా.. 1980 నవంబర్ 27న హమ్ పాంచ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. రెండేళ్ళ గ్యాప్ లో ఒకే కథతో నవంబర్ నెల బాట పట్టిన ఈ విభిన్న భాషా చిత్రాలు బాపుకి దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చాయి.
![]() |
![]() |