'ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన తమిళ చిత్రం 'మాస్టర్'. కోలీవుడ్ స్టార్ విజయ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మరో స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. మాళవికా మోహనన్ నాయిక. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ పాటికే విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్లలో సందడి చేయనుందని తెలిసింది.
ఇదిలా ఉంటే.. 'మాస్టర్' చిత్రం నిడివికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. దాదాపు 181 నిమిషాల పాటు ఈ యాక్షన్ డ్రామా సాగుతుందట. అయితే నిడివి ఎక్కువే అయినా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా మూవీని పిక్చరైజ్ చేశారట లోకేష్. మరి.. ఈ లెంగ్తీ యాక్షన్ డ్రామా జనాలను ఏ మేరకు రంజింపజేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, 'మాస్టర్' కి సంబంధించిన టీజర్ దీపావళికి సందడి చేయనుందని సమాచారం.