కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న కాలంలో ఆపద్బాంధవుడిగా పేరు మారుమోగుతున్న వ్యక్తి సోనూ సూద్. దేశంలోని ఏ ఇతర నటుల కన్నా కూడా కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకుంటూ తన ఉదార హృదయాన్నీ, దాతృత్వాన్నీ చాటుకుంటూ వస్తున్నాడు. అరుంధతిలో బొమ్మాళీ నొన్నదలా అంటూ ప్రేక్షకులను తన భయంకర రూపంతో, బీభత్స నటనతో భయపెట్టిన అతను.. అదంతా తెరమీదేననీ, నిజ జీవితంలో తాను అందుకు పూర్తి విరుద్ధమైన హీరోననీ అతను నిరూపించుకుంటున్నాడు. వలస కార్మికులను వాళ్ల స్వస్థలాలకు పంపించడం దగ్గర్నుంచి, మొన్నటి ఆంధ్రప్రదేశ్ రైతుకు ట్రాక్టర్ పంపించడం దాకా అతను చేసిన పనులే అతనేమిటనేది పట్టిస్తాయి.
ఆ విషయం అలా ఉంచితే, ఒకప్పుడు సన్నగా రివటలా కనిపించిన అతను ఇవాళ కండల వీరుడిగా దర్శనమిస్తున్నాడు. లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో అతను షేర్ చేసిన పిక్చర్ ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. 1997 నాటి ఫొటోను షేర్ చేసిన అతను తనమీద తానే జోక్ వేసుకుంటూ, “...and I dared to become an actor. #1997” అనే క్యాప్షన్ పెట్టాడు. ఆ పిక్చర్లో చాలా పీలగా కనిపిస్తున్న అతడిని చూస్తుంటే, ఇప్పటి సోనూ సూద్ యేనా అలా ఉంది! అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే బక్కగా ఉన్నా.. అప్పుడు కూడా ఫిట్ గానే ఉన్నాడు సోనూ.
ఆ పిక్చర్ చూసి అనేకమంది ఫాలోయర్లు కామెంట్లు పెట్టారు. వారిలో బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ కూడా ఉన్నారు. ఆమె “Lean & HUNGRY look.” అంటూ కామెంట్ పెట్టారు. ఒక ఫ్యాన్ “Actor is secondary..but you are a true human being from day one of your life.. and that’s important.” అని పెట్టిన కామెంట్ ఇవాళ సోనూ సంపాదించుకున్న పేరుకు అద్దం పట్టేట్లు ఉంది.