![]() |
![]() |

గబ్బర్ సింగ్ ముందు వరకు కమలహాసన్ గారాల పట్టి శృతిహాసన్ పై ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. కానీ ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్లో ఆమె పూర్తిగా స్వింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత పవన్ తోనే కలిసి కాటమరాయుడు అనే చిత్రంలో నటించింది. గబ్బర్ సింగ్ స్థాయిలో విజయం సాధించకపోయినా కాటమరాయుడు కూడా విజయవంతమైన చిత్రంగానే పేరు తెచ్చుకుంది. ఇక రాంచరణ్ తో ఎవడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక అల్లు అర్జున్ తో రేసుగుర్రంలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకొని పోతోంది. అంతేకాదు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిందులేసిన ఆమె మరోవైపు బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి లో ఆడి పాడింది. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాల్లో ఆమె నిడివి మాత్రం ఏ మాత్రం చెప్పుకో దగ్గగా లేదు. ఏదో పాటలకు తప్ప ఈమె పాత్రలకు ప్రాధాన్యం అనేది లేదు. వీరసింహారెడ్డి లో ఈమె కంటే హనీ రోజ్ క్యారెక్టర్ బాగుంది. వీరందరికంటే వరలక్ష్మి శరత్ కుమార్ కు వచ్చిన పేరే ఎక్కువ కనిపించింది. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ గా కనిపించినప్పటికీ ఈ పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. అయినా సినిమాలోని తన పాత్రలను చూడకుండా ఈమె స్టార్ హీరోలకు మాత్రం ఉదారంగా కాల్షిట్టు ఇస్తోంది. తద్వారా స్టార్ హీరోలతో నటించి చిత్రాలు విజయవంతం అయితే ఆ సినిమాల సక్సెస్ క్రెడిట్ లో తాను భాగం కావాలని కోరుకుంటుంది. పాత్ర ఎంత ఏమిటి అనేది చూసుకోకుండా స్టార్ హీరో అయితే ఓకే అనేస్తోంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి శృతిహాసన్ మెగా కాంపౌండ్ కు గోల్డెన్ లెగ్గుగా మారిందని చెప్పాలి.
![]() |
![]() |