![]() |
![]() |

సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ నేపథ్యంలో.. సూర్య తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. అయితే.. సూరరై పోట్రు తరువాత వెంటనే సినిమాతో కాకుండా ఓ ఆంథాలజీతో పలకరించబోతున్నారు సూర్య. నవరస పేరుతో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న ఈ తొమ్మిది ఉపకథల సమాహారంలో ఓ ధారావాహికలో సూర్య హీరోగా నటిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ నవరసభరిత ఆంథాలజీ.. ఏప్రిల్ నెలలో ఓ ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇందులో సూర్య ఓ యువ సంగీత దర్శకుడి పాత్రలో దర్శనమిస్తారని కోలీవుడ్ బజ్. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని వినికిడి. త్వరలోనే ఈ పాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. కాగా, ఇందులో సూర్య సరసన మలయాళ ముద్దుగుమ్మ ప్రగ్యా మార్టిన్ నటిస్తోంది. మరి.. మ్యూజిక్ డైరెక్టర్ రోల్ లో సూర్య ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే ఏప్రిల్ వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |