![]() |
![]() |

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. ఇందులో పవన్ కి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. గబ్బర్ సింగ్ లా కేవలం ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగానే కాకుండా ఓ సోషల్ మెసేజ్ ని జోడించి మరీ హరీష్ శంకర్ రూపొందించనున్న ఈ సినిమాలో పవన్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు.. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందని, అక్కడ చిత్రీకరించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్స్ గా నిలుస్తాయని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, 2021 చివరలోగానీ లేదంటే 2022 ఆరంభంలోకానీ ఈ సినిమా తెరపైకి వస్తుంది.
![]() |
![]() |