![]() |
![]() |

ఈ జనరేషన్ లో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) ఒకరు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి మూడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (Anaganaga Oka Raju)
సోమవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నవీన్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది.
"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మౌత్ టాక్ తో మీరు పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో 'అనగనగా ఒక రాజు'కి టికెట్స్ బుక్ చేసుకొని జనవరి 14న థియేటర్ కి రండి.. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాది.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇక్కడివరకు ఎలా వచ్చావని అందరూ నన్ను అడుగుతుంటారు. నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. నాకు బ్యాక్ గ్రౌండ్ గా ఎన్నో ఫ్యామిలీలు ఉన్నాయి. నా చివరి శ్వాస వరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను." అని నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చాడు.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
![]() |
![]() |